Site icon NTV Telugu

Army Dog: ఆర్మీ డాగ్ “జూమ్” కన్నుమూత.. టెర్రరిస్టులతో పోరాడుతూ తీవ్రంగా గాయపడి మృతి

Army Dog Zoom

Army Dog Zoom

Army assault dog Zoom passed away: ఆర్మీ డాగ్ ‘జూమ్’ కన్నుమూసింది. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం చివరి శ్వాస విడిచింది. సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించింది జూమ్. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతున్న క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ ఆపరేషన్ సమయంలో జూమ్ కు రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఓ వైపు బుల్లెట్ గాయాలు అయినా కూడా.. జూమ్ మాత్రం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చేలా సహాయపడింది.

తీవ్రగాయాలు అయిన జూమ్ ను శ్రీనగర్ లో ఓ ఆస్పత్రిలో ఉంచి వైద్య సహాయం అందించారు. గాయాలకు శస్త్ర చికిత్స జరిగింది. బుధవారం జూమ్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది ఆర్మీ. మరో 24-48 గంటలు గడిస్తే కానీ జూమ్ పరిస్థితి చెప్పలేమని.. ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించింది. ప్రత్యేకంగా వైద్య బృందం చికిత్స అందించిన కూడా జూమ్ ప్రాణాలు దక్కలేదు. గురువారం కన్నుమూసింది.

Read Also: Chennai: యువతిని రైలు కిందకు తోసిన ప్రేమోన్మాది. ఘటనపై సీఎం సీరియస్

అనంత్ నాగ్ కోకెర్ నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతం అవ్వగా, ఇద్దరు జవాన్లతో పాటు ఆర్మీ డాగా జూమ్ గాయపడింది. గురువారం ఉదయం 11.45 గంటలకు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఆర్మీ దాడి కుక్క జూమ్, శ్రీనగర్‌లోని ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు అధికారులు తెలిపారు.

జూమ్ పరిస్థితి ఈ రోజు మధ్యాహ్నం వరకు బాగానే ఉందని.. చికిత్సకు స్పందిస్తోందని.. అయితే ఉన్నట్టుంది ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఆ తరువాత మరణించిందని అధికారులు వెల్లడించారు. ఆర్మీ డాగ్ జూమ్ ఆపరేషన్ టాంగ్‌పావాస్ పోరాట బృందంలో భాగం. జూమ్ రెండేళ్ల ఒకనెల వయసున్న మాలినోయిస్/ బెల్జియన్ షెఫర్డ్ జాతికి చెందినది. గత ఎనిమిది నెలలుగా జూమ్ ఆర్మీలో తన సేవలు అందిస్తోంది.

Exit mobile version