Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు

  • పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట
  • హాజరైన నారా లోకేష్ దంపతులు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Arjuntendulkarwedding

Arjuntendulkarwedding

ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ దంపతులు పెళ్లిలో సందడి చేశారు. నారా లోకేష్ దంపతులను ప్రత్యేకంగా పలకరించారు.

అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం నిశ్చయం అయిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల జామ్‌నగర్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అనంతరం మెహిందీ, సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఇక గురువారం ఉదయం అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.