Arjun Tendulkar Wedding: అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో అతిథులు సందడి.. ఫొటోలు వైరల్

  • పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట
  • హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Arjuntendulkarwedding1

Arjuntendulkarwedding1

ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

టీమిండియా కోచ్‌ గౌతమ్ గంభీర్, ఎంఎస్.ధోనీ, మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అభితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు. అలాగే ముఖేష్ అంబానీ దంపతులు పెళ్లిలో సందడి చేశారు.

అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం నిశ్చయం అయిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల జామ్‌నగర్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అనంతరం మెహిందీ, సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఇక గురువారం ఉదయం అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.