NTV Telugu Site icon

New Governors: బీహార్‌, కేరళ రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికైన గవర్నర్ల ప్రమాణస్వీకారం..

Governors

Governors

New Governors: ఈరోజు (జనవరి 2) బీహార్‌, కేరళ రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికైన గవర్నర్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్ ఇవాళ బీహార్‌ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. అలాగే, ఇన్ని రోజులూ బీహార్‌ గవర్నర్‌గా విధులు నిర్వహించిన ‌రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ కేరళ గవర్నర్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. ఇందులో, మిజోరం గవర్నర్‌గా జనరల్‌ విజయ్‌ కుమార్‌ సింగ్‌, మణిపూర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బీహార్‌ గవర్నర్‌గా ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు గత నెల 24వ తేదీన రాష్ట్రపతి భవన్‌ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేసేశారు.

Show comments