Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు శరత్ చంద్రారెడ్డితో పాటూ విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి బెయిల్ పిటిషన్లపై సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన పల్లిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో శరత్ చంద్రారెడ్డిని హాజరుపరిచింది.
Read Also: Air India Incident: పీ గేట్ వివాదం.. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా..పైలెట్‌పై చర్యలు
ఈ కేసులో సౌత్ గ్రూపు పైనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు సౌత్ గ్రూప్ చేరవేసిందని కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూపులో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, బోయినపల్లి అభిషేక్ ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈడీ రూ.100 కోట్లకు సంబంధించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. లిక్కర్ పాలసీ ద్వారా పలువురికి లబ్ధి చేకూర్చరాని ఈడీ ఆరోపించింది. 12 శాతం లాభాలు పొందేలా ప్లాన్ చేశారని.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి కీలక భూమిక పోషించారని కోర్టులో వాదనలు నడిచాయి.
శరత్ చంద్రారెడ్డి కంపెనీలను ఈ స్కాంలో భాగస్వామ్యం చేశారని.. క్యాష్ కలెక్షన్స్ ఈయనే కంట్రోల్ చేశారని ఆరోపించింది ఈడీ. సాక్ష్యాలు లేకుండా సర్వర్లను, ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. అవంతిక, ఆర్గానిక్స్ కంపెనీలు ఈ స్కాంలో భాగస్వాములుగా ఉన్నాయని.. మూడు నాలుగు కంపెనీలను ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఆపరేట్ చేశారని కోర్టుకు తెలిపింది ఈడీ.