Site icon NTV Telugu

High Waves: అల్లోకల్లోలంగా ఆరేబియా సముద్ర తీరం.. ముంబైలో భారీ వర్షాలు..

High Waves

High Waves

High Waves: నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబయిలో అయితే వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత వారం రోజులుగా ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారం నుంచి విరామం లేకుండా ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. దాంతో లోతలోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

Read also: Health Tips: జీలకర్రను ఇలా తీసుకుంటే చాలు.. త్వరగా బరువు తగ్గుతారు..

గత ఆదివారం నుంచి విరామం లేకుండా వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలోని అంధేరీ సహా పలు ఏరియాల్లోని అండర్‌పాస్‌లు, సబ్‌వేలలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు ఉదయం కూడా అంధేరీలో భారీ వర్షం పడటంతో సబ్‌వేలో భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ముంబైలో జూన్‌ నెలలో కురువాల్సిన వర్షాల్లో 97 శాతం కురిశాయని అధికారులు తెలిపారు. మరోవైపు ముంబైలోని ఆరేబియా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న మెరైన్‌ డ్రైవ్‌ (నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ రోడ్డు) వైపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతారణ శాఖ అధికారులు ప్రకటించారు.

Exit mobile version