NTV Telugu Site icon

Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం

Parliament

Parliament

Parliament Of CJI: కేంద్రం ఎన్నికల సంఘం నియామకంలో సుప్రీంకోర్టు ప్రధనా న్యాయమూర్తి(సీజేఐ) పాత్ర లేకుండా చేయడానికి కేంద్రం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇకపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)తోపాటు ఎన్నికల కమిషనర్ల నియామకం ప్యానల్‌ నుంచి సీజేఐని తొలగించి .. ఆయన స్థానంలో కేంద్ర కేబినెట్‌ మంత్రిని సభ్యుడిగా చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించడం కోసం పార్లమెంటలో ప్రతిపాదిత బిల్లుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. ఆ బిల్లు కాస్త గురువారమే రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఇకపై సీఈసీతోపాటు ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ లేకుండానే నియామకాలు జరిగిపోతాయి.

Read also: Suicide Attempt: కాకినాడ బీచ్‌ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ఈ ఏడాది మార్చిలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొనాలని తీర్పునిచ్చింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులో.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై పార్లమెంటు చట్టం రూపొందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తీర్పులో పేర్కొంది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ సలహాల ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పును తాజా బిల్లు బలహీనపర్చనుందని కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) బిల్లు-2023ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి లిస్ట్ చేసినట్టు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కొత్త బిల్లును తీసుకురావడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుంది. కేంద్రం ముఖ్యమైన సంస్థలను నియంత్రించడానికి మరొక ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. ‘‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌ని సిఫార్సు చేయడానికి ప్రధానమంత్రి సెలక్షన్ కమిటీ సభ్యునిగా సీజేఐ స్థానంలో ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని నియమిస్తారు. ప్రతిపక్ష నాయకుడు కూడా సభ్యుడిగా ఉన్నప్పటికీ.. మెజారిటీ అధికార పార్టీకే ఉంటుంది. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థను నియంత్రించడానికి ఇది మరొక మార్గని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ విమర్శించారు.