దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. పట్టభద్రులైన అందరికి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు. కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్, లోన్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దేశంలోని టాప్ కంపెనీల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. తాజాగా మరోసారి యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Also Read:Delhi : గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ. 21,000ఇవ్వనున్న ప్రభుత్వం ?
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా అదనపు నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు pminternship.mca.gov.inలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తరువాత వివిధ సెక్టార్లలో తమకు అనువైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 12 నెలల పెయిడ్ ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. ప్రతి నెలా రూ.5000 అందిస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తైన తర్వాత ఒక్కసారి రూ.6000 చెల్లిస్తారు.
Also Read:Chicken and Egg Dishes Free: చికెన్, గుడ్లు ఫ్రీ.. ఫ్రీ.. వంటలు చేసి మరీ పంపిణీ..
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి మార్చి 12 వరకు గడువు విధించారు. అర్హుల విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు 21- 24 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుంది. అలాగే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద, ప్రతి శిక్షణార్థికి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీని అందిస్తుంది.