NTV Telugu Site icon

Neha Murder Case: ‘‘ నా కొడుకును శిక్షించండి’’.. ఫయాజ్ తండ్రి క్షమాపణ..

Neha Case

Neha Case

Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హత్య కేసు సంచలనంగా మారింది. ఈ హత్య రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఫస్ట్ ఇయర్ ఎంసీఏ స్టూడెంట్‌ నేహా(22)ని ఫయాజ్(23) అనే వ్యక్తి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కాలేజ్ క్యాంపస్‌లోనే చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీని నిందిస్తోంది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ మండిపోడుతోంది, అంతే కాకుండా ఈ హత్యలో ‘లవ్ జిహాద్’ కోణం ఉన్నట్లు ఆరోపించింది. అయితే, ఇది వ్యక్తిగత విషయమని, ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పింది. అయితే, నేహా తండ్రి నిరంజన్ హిరేమత్ కూడా తన బిడ్డను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు.

Read Also: Shriya Saran: శ్రీయ అందాలకి కుర్రకారు ఫిదా…

ఇదిలా ఉంటే ఈ హత్యపై నిందితుడు ఫయాజ్ తండ్రి స్పందించారు. నేహను చంపిన తన కుమారుడిని కఠినంగా శిక్షించాలని కోరాడు. పాఠశాల ఉపాధ్యాయుడైన ఫయాజ్ తండ్రి బాబా సాహెబ్ సుబానీ శనివారం మీడియాలో మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 6 గంటల కు తనకు సంఘటన గురించి తెలిసిందని, తన కుమారుడి చర్యతో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి పనిచేయడానికి భయపడే విధంగా అతని శిక్ష ప డాలి. నేహా కుటుంబాన్ని చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. ఆమె నా కూతురు లాంటిది’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. గత ఆరేళ్లుగా తాను, తన భార్య వేరువేరుగా ఉంటున్నామని, ఫయాజ్ తల్లి దగ్గరే ఉంటున్నాడని, 3 నెలల క్రితం చివరిసారిగా తన కొడుకుతో మాట్లాడినట్లు వెల్లడించారు.

8 నెలల క్రితం నేహా కుటుంబం తనకు ఫోన్ చేసి తన కుమారుడు, నేహాను వేధిస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తన కొడుకు తప్పు చేశాడని ఒప్పుకుంటూనే.. ఫయాజ్, నేహ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్ షిప్‌లో ఉన్నారని చెప్పాడు. ఫయాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడని, కానీ నేను దానికి నిరాకరించానని నిందితుడి తండ్రి అన్నారు. ‘‘ మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. నన్ను క్షమించాలని కర్ణాటక ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను.’’ అని అన్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని అప్పుడే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.