Site icon NTV Telugu

Vellampalli Srinivas: జగన్‌ను ఓడించడం ఎవరి తరం కాదు.. 175 స్థానాలు మావే..!

రాసిపెట్టుకొండి వైఎస్‌ జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్‌ సహా ఎవరి తరం కాదని జోస్యం చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్నాయుడు త్వరగా ఎన్నికలొచ్చేయాలి…అధికారంలోకి వచ్చేయాలని తపన పడుతున్నారని సెటైర్లు వేశారు. మా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయ్యింది.. ఉప ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్ని ఎన్నికలనూ ఎదుర్కొన్నాం.. ఒక్క ఎన్నికలోనైనా టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చిందా? అని ప్రశ్నించారు.. అన్నం తినేటప్పుడు ఎవడూ అబద్ధాలాడతాడని అనుకోన్న వెల్లంపల్లి.. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ లేదు బొక్కా లేదని అచ్చెన్నాయుడు అన్నాడా లేదా? అని నిలదీశారు.. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారు.. క్యాడర్‌ను ఉత్సాహపరచడానికే పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని మభ్యపెడుతున్నారన్న ఆయన.. రాసి పెట్టుకోండి… జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ తరం కాదన్నారు.

Read Also: Ukraine: మరో భారత విద్యార్థి మృతి

ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నారని తెలిపారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని మండిపడ్డా ఆయన.. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి డిపాజిట్లు కూడా రావన్నారు.. కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని.. రాజకీయాల్లో లోకేష్ ఒక కమెడియన్‌ అని ఎద్దేవా చేశారు. లోకేష్ ను చిన్న నాయకుడిగా కూడా ఎవరూ పోల్చడం లేదన్న ఆయన.. మరోవైపు చంద్రబాబుకి పూర్తిగా మతి భ్రమించిందని.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 175 మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి.. ఇక, ఏపీలో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయింది.. క్యాడర్‌ను కాపాడుకోవడానికే ముందస్తు ఎన్నికలంటూ బాబు హడావిడి చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ముందస్తు ఎన్నికలొస్తాయని చంద్రబాబు ఎలా చెబుతాడు? ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదన్నారు. 2024లో చంద్రబాబుకి అభ్యర్ధులు కూడా దొరకరని సెటైర్లు వేశారు.. ముందస్తొచ్చినా… మధ్యస్తొచ్చినా… ఈ రాష్ట్రంలో ఎగిరేది వైసీపీ జెండానే అని స్పష్టం చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.

Exit mobile version