NTV Telugu Site icon

NIA: కెనడాతో లింకులున్న టెర్రర్-గ్యాంగ్‌స్టర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్ఐఏ

Nia

Nia

NIA: ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాదం చిచ్చుపెట్టింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కెనడాతో సంబంధం ఉన్న ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్ కి చెందిన 43 మంది వ్యక్తుల వివరాలను బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభత్వం స్వాధీనం చేసుకోగల వారి ఆస్తుల వివరాలను పంచుకోవాలని ఎన్ఐఏ కోరింది.

Read Also: Amit Shah: 2024లో మహిళా బిల్లు లేదు.. లోక్‌సభలో స్పష్టం చేసిన అమిత్ షా

ఎన్ఐఏ లిస్టులో లారెన్స్ బిష్ణోయ్, జస్దీప్ సింగ్, కాలా జాతేరి అలియాస్ సందీప్, వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాల రాణా మరియు జోగిందర్ సింగ్‌ల ఫోటోలు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్లలో చాలా మంది కెనడాలో ఉన్నారని ఎన్ఐఏ పోస్టు హైలెట్ చేసింది. ఈ గ్యాంగ్ స్టర్ల పేరు మీద లేదా వారి సహచరులు, స్నేహితులు, బంధువుల పేరుపై ఉన్న ఆస్తులు, వ్యాపారాల వివరాలను పంచుకోవాలని కోరింది. ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ల వివరాలను గురించిన పోస్టును ఎన్ఐఏ తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పంచుకుంది.

జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఇతను సిక్కు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’పేరుతో ఓ ఉగ్రసంస్థను నడుపుతున్నారు. ఇదే కాకుండా గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. వీరందరికి పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా నిధులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. భారత్ నుంచి పంజాబ్ ని వేరుచేసి ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఈ ఉగ్రసంస్థలు భారత్ కి వ్యతిరేకంగా ద్వేషాన్ని నూరిపోస్తున్నాయి.

Show comments