Site icon NTV Telugu

JNU: జేఎన్‌యూలో మరో వివాదం.. క్యాంపస్‌లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు

Jnu

Jnu

Anti-Brahmin slogans on walls of JNU spark controversy: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ మరో వివాదానికి కేంద్రం అయింది. యూనివర్సిటీ క్యాంపస్ లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు చేయడంతో మరోసారి వివాదం చెలరేగింది. లాంగ్వేజ్, లిటరేచర్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల గోడలపై బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు దర్శనిమచ్చాయి. ఇది వామపక్ష-బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీల మధ్య మరోసారి ఉద్రక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీనికి లెఫ్ట్ విద్యార్థి సంఘాలే కారణం అని బీజేపీ ఆరోపిస్తోంది. బ్రహ్మణ, బనియా వ్యతిరేక నినాదాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Read Also: Tesla: టెస్లా నుంచి హెమీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఆవిష్కరించిన ఎలాన్ మస్క్

అయితే ఈ ఘటనపై జేఎన్‌యూ పాలకవర్గం ఇంకా స్పందించలేదు. గోడలపై ‘‘బ్రహ్మణులు క్యాంపస్ విడిచివెళ్లండి’’, ‘‘బ్రహ్మణ భారత్ ఛోడో’’, ‘‘బ్రాహ్మణ-బనియాలు, మేము మీ కోసం వస్తున్నాము! మేము ప్రతీకారం తీర్చుకుంటాము’’ అంటూ రెచ్చగొట్టే విధంగా నినాదాలను గోడలపై రాశారు. కమ్యూనిస్ట్ గుండాలు విద్యారంగ స్థలాలను విపరీతంగా ధ్వంసం చేయడాన్ని ఏబీవీపీ ఖండిస్తోందని..జేఎన్‌యూ గోడలపై కమ్యూనిస్ట్ దుర్భాషలు రాశారని.. స్వేచ్ఛగా ఆలోచించే ప్రొఫెసర్లను భయపెట్టేందుకు వారి ఛాంబర్లను పాడు చేశారు అని ఏబీవీపీ జేఎన్‌యూ అధ్యక్షుడు రోహిత్‌ కుమార్‌ ఆరోపించారు.

ఈ ఘటనను జేఎన్‌యూ ఉపాధ్యాయుల సంఘం కూడా ఖండించింది. ఈ ఘటనకు లెఫ్ట్-లిబరల్ గ్రూప్ బాధ్యత వహించాలని ట్వీట్ చేసింది. గతంలో కూడా జేఎన్‌యూ పలు వివాదాలకు కేంద్రం అయింది. సీఏఏ, కాశ్మీర్ అంశాలపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అక్కడి వామపక్ష విద్యార్థి సంఘం. దీంతో ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాల మధ్య తరుచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.

Exit mobile version