Site icon NTV Telugu

Sri Lanka: లంకకు మరో రామసేతు.. ఇరు దేశాల మధ్య చర్చలు

Rama Setu

Rama Setu

రామాయణంలో రావణుడిని చంపి.. లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి వానర సేన సముద్రంలో రామసేతను నిర్మించింది. అయితే దీని మీద ఎన్నో వివాదాలు ఉన్న.. మెజారిటీ ప్రజలు మాత్రం సముద్రంలో ఇప్పటికీ నీటిమీద తేలియాడే రాళ్లు.. రామసేతుకు నిదర్శనమని నమ్ముతారు. అయితే ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం, భారత సర్కార్ దగ్గర ప్రతిపాదనలను ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.

Read Also: Maruthi: మారుతీని ఏకిపారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. నీకు సినిమా ఇచ్చింది ఎవరు.. ?

రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు.. ఈ పర్యటనలో వివిధ అంశాలు, ద్వైపాక్షిక చర్చలను శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే జరిపారు. అయితే, ఇందులో భాగంగానే భారత్ – శ్రీలంక మధ్య పెట్రోలియం పైప్‌లైన్, ఇరు దేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు భూమార్గంలో వంతెన నిర్మాణానికి సంబంధించి నరేంద్ర మోడీ దగ్గర ఓ ప్రతిపాదనలను శ్రీలంక అధ్యక్షుడు ఉంచినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించిన మోడీ వాటిని నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాలపై ప్రధానంగా మాట్లాడుకున్నారు.

Read Also: Ponguleti Srinivas Reddy: చిత్తశుద్దితో హస్తం గుర్తుపై ఓట్లు పడేలా కృషి చేస్తాం

గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న టైంలో భారత్ అందించిన సహాయం మరిచిపోలేనిదని రణిల్ విక్రమ సింఘే గుర్తు చేసుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీలతో రణిల్ విక్రమ సింఘే సమావేశం అయ్యారు. శ్రీలంకలో ఉన్న తమిళుల రక్షణ, గౌరవం కోసం ఆ దేశం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని రణిల్ విక్రమసింఘేకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. భారత తమిళులు శ్రీలంకకు వెళ్లి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా వారి కోసం రూ.75 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు. పర్యాటకం, విద్యుత్త్, వాణిజ్యం, ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి సహా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Exit mobile version