కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కుంభమేళా కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారిందనే విమర్శలు ఆదినుంచి వినిపిస్తున్నాయి.. దాని తగ్గట్టుగానే క్రమంగా పీఠాధిపతులు కన్నుమూయడం కలకలం రేపుతోంది.. తాజాగా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ మహంత్ లఖన్ గిరి కన్నుమూశారు.. అనారోగ్యంబారినపడి మూడు వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనకు .. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. మహంత్ లఖన్ గిరిని మొదట జగ్జీత్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆ తర్వాత రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.. అయితే, ఉత్తరాఖండ్‌లోని కుంభమేళాలో పాల్గొన్నారాయన.. అక్కడే ఆయనకు కోవిడ్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక, కుంభమేళాలో పాల్గొని కరోనా సోకి మృతిచెందిన మఠాధిపతుల సంఖ్య నాలుగు చేరింది.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తితో కుంభ మేళా ముసిగినట్టు నిర్వహకులు ముందే ప్రకటించారు.. అప్పటి నుంచి క్రమంగా భక్తులు సంఖ్య తగ్గిపోయింది.. ఇది అధికారికంగా ఏప్రిల్ 30న ముగియనుంది.. మరోవైపు.. 5 రోజుల వ్యవధిలో కుంభమేళాలో దాదాపు 1,700 మందికి కోవిడ్ సోకడం కలకలం రేగింది.. ఉత్తరాఖండ్‌లో సోమవారం 5,058 కోవిడ్ కేసులు నమోదు కాగా.. డెహ్రాడూన్‌లో 2,034, హరిద్వార్ లో 1,002 వెలుగు చూశాయి.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మహా కుంభమేళాకు అనుమతించడంపై సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.