Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Another Monkeypox Case Confirmed In Kerala As Uae Returnee Tests Positive

Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో 7కు చేరిన సంఖ్య

Published Date :August 2, 2022 , 3:14 pm
By Mahesh Jakki
Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో 7కు చేరిన సంఖ్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Monkeypox: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కొద్ది రోజుల తర్వాత, యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడంతో మంకీపాక్స్ నిర్ధారణైంది. ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో ఐదో మంకీపాక్స్ కేసు ఇది. కేరళలో మరో మంకీపాక్స్ కేసు వార్తలను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. 30 ఏళ్ల రోగి ప్రస్తుతం మలప్పురంలో చికిత్స పొందుతున్నాడని ఆరోగ్య మంత్రి తెలిపారు.

యూఏఈ నుంచి జూలై 27న కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో మంకీపాక్స్ లాంటి లక్షణాలతో ఒక వ్యక్తి మరణించిన తరువాత 20 మందిని నిర్బంధించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. బాధిత కుటుంబసభ్యులు, స్నేహితులతో సహా కేవలం 10 మందితో ఆ వ్యక్తి సన్నిహితంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. పరిస్థితి అదుపులో ఉందని.. ప్రస్తుతానికి ఎలాంటి భయాందోళనలు లేవని వైద్యారోగ్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలు రెంజిని వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులు, స్నేహితులతో సలహా కేవలం 10 మందితో మాత్రమే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడని తెలిపారు. ఇప్పటివరకు 20 మందిని నిర్భందించినట్లు ఆమె పేర్కొన్నారు.

మంకీపాక్స్ అనేది మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే జూనోటిక్ వ్యాధి. ఇది మశూచికి కారణమయ్యే అదే వైరస్‌ల కుటుంబానికి చెందినది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి పశ్చిమ, మధ్య ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవల, స్థానికేతర దేశాల నుండి కూడా కేసులు నమోదయ్యాయి.మంకీపాక్స్ సాధారణ లక్షణాలు జ్వరం, దద్దుర్లు, శోషరస కణుపుల వాపుతో పాటు అనేక రకాల వైద్యపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉండే వ్యాధి. సరైన చికిత్స తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది. కొత్తగా కేసులు నమోదవుతుండడంతో పరిస్థితిని పర్యవేక్షించడానికి, ప్రతిస్పందన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం సోమవారం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

Heath Davis: మాజీ స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన.. అవును.. నేను ‘గే’..!!

ఇవాళ ఢిల్లీలో ఓ నైజీరియన్ జాతీయుడికి ఈ వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల నైజీరియన్ గత ఐదు రోజులుగా శరీరంపై దద్దర్లు, జ్వరం రావడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. తాజాగా సోమవారం వచ్చిన రిపోర్టులో అతనికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులు కూడా మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన ఈ రెండు కేసులతో కలిపి దేశంలో మొత్తం 7 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india monkeypox cases
  • Kerala Health Minister Veena George
  • monkeypox
  • monkeypox in india
  • monkeypox in kerala

తాజావార్తలు

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions