Site icon NTV Telugu

Uttar Pradesh: నగ్నంగా బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి చంపినట్లు అనుమానం

Up Incident

Up Incident

Another girl was killed in Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరో బాలికను హత్య చేశారు. ఔరయ్యా జిల్లా దిబియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారు పోలీసులు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మరణంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు మృతదేహంతో పారిపోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. అయితే కాంగ్రెస్ విమర్శలను పోలీసులు తప్పుబట్టారు.

బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం బహిర్భూమికి వెళ్లిన బాలిక ఎంత సేపటికి తిరిగి రాలేదని.. ఆమె కోసం గాలింపులు చేపట్టగా, సమీపంలోని పొలంలో మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఘటనస్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ కేసును ఛేదించడానికి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో సహా 10 పోలీసు టీములను ఏర్పాటు చేసినట్లు ఔరయ్యా జిల్లా ఎస్పీ చారు నిగమ్ వెల్లడించారు.

Read Also: YS Sharmila: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. షర్మిలపై కేసు నమోదు

ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఔరయ్యా జిల్లాలో పొలంలో 17 ఏళ్ల బాలిక నగ్న మృతదేహాన్ని కనుక్కున్నారని.. పోలీసులు వచ్చి హడావిడిగా మృతదేహాన్ని తీసుకొని పారిపోవడం ప్రారంభించారని..ఉత్తర్ ప్రదేశ్ నేరాల్లో నెంబర్ వన్ అని .. కానీ దాన్ని ఎవరూ ‘జంజ్ రాజ్’ అని పిలువరు అని ట్వీట్ చేసింది. ఆరోపణలను తోసిపుచ్చిన ఎస్పీ నిగమ్, పోలీసులు అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసి కుటుంబ సభ్యులను శాంతింపజేసిన తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

 

Exit mobile version