Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మరోసారి అపశృతి.. ఎగిసిపడ్డ మంటలు.. టెంట్‌లు దగ్ధం

  • కుంభమేళాలో మరోసారి అపశృతి
  • ఎగిసిపడ్డ మంటలు.. టెంట్‌లు దగ్ధం
  • భక్తులంతా సురక్షితంగా ఉన్నారన్న అధికారలుు
Mahakumbhmela2025

Mahakumbhmela2025

మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చట్నాగ్ ఘాట్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఝూన్సీ ప్రాంతంలో సెక్టార్-22లో తాత్కాలికంగా వేసిన టెంట్‌ల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. భక్తులంతా సురక్షితంగా ఉన్నారని.. ప్రమాదస్థలి నుంచి భక్తులను తరలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Anna Hazare: ‘‘డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడు’’.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..

బుధవారం తెల్లవారుజామున కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోగా.. 60 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై ప్రధాని మోడీ సహా సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అంతేకాకుండా ఘటనపై ముగ్గురుతో కూడిన న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం యోగి ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: AP: మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. కార్యాలయాల వద్ద భారీ రద్దీ