Site icon NTV Telugu

Karnataka: నలుగురు మైనర్లపై లైంగిక వేధింపులు..లింగాయత్ పీఠాధిపతిపై మరో కేసు

Lingayat Seer Shivamurthy

Lingayat Seer Shivamurthy

Another case against Lingayat seer Shivamurthy for Physical assaulting minor girls: అత్యాచార ఆరోపణలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న లింగాయత్ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణరుపై మరో కేసు నమోదు అయింది. నలుగురు మైనర్ బాలికపై గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపించడంతో తాజా కేసు నమోదు అయింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన గతంలో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసులో ప్రజలు, ప్రజాసంఘాల నుంచి తీవ్రమైన ఒత్తడి రావడంతో శివమూర్తి మురుగ శరణరును అరెస్ట్ చేశారు.

లింగాయత్ మఠాధిపతి శివమూర్తి జనవరి 2019 నుంచి జూన్ 2022 మధ్య అనేకసార్లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలు ఆరోపించారు. మైసూరులోని నజరాబాద్ పోలీస్ స్టేషన్లో పిల్లల తల్లిదండ్రులు శివమూర్తిపై ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా మఠంలోని హాస్టల్ వార్డెన్ తో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. లైంగిక వేధింపులకు పాల్పడిన లింగాయత్ మఠాధిపతిపై ఇది రెండో పోక్సో కేసు.

Read Also: Lakshmi Parvathi: ఛీ ఛీ.. బాలకృష్ణను చూస్తుంటే పరమ అసహ్యం వేస్తోంది.. ఎన్టీఆర్ కొడుకేనా

గతంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడనే ఆరోపణతో సెప్టెంబర్ నెలలో అతన్ని అరెస్ట్ చేశారు. ఆగస్టు 26న శివమూర్తిపై కేసు నమోదు అయింది. శివమూర్తిపై గతంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి కేసులో ఐదుగురిపై కేసు నమోదు అయింది. మఠం నడుపుతున్న హాస్టల్ లో ఉంటూ చదువుతున్న 15,16 ఏళ్ల ఇద్దరు బాలికలపై మూడున్నరేళ్లకు పైగా లైంగిక వేధింపులకు పాల్పడటంతో కేసు నమోదు అయింది. లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో బాగా పలుకుబడి ఉన్న కమ్యూనిటీ. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్నందున రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, పలు పార్టీలకు చెందిన నేతలు లింగాయత్ మఠాధిపతులకు వ్యతిరేకంగా మాట్లాడటం చేయడం లేదు.

Exit mobile version