NTV Telugu Site icon

South Central Railway: వారంలో హైదరాబాద్-ఢిల్లీ రూట్‌లో బాలాసోర్ లాంటి ప్రమాదం.. రైల్వేకి హెచ్చరిక లేఖ?

Train Warning Letter

Train Warning Letter

Warning Letter Of Balasore Like Train Tragedy : వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ‘బాలాసోర్ తరహా రైలు ప్రమాదం’ జరుగుతుంది అని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల వచ్చిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని రైల్వే అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒడిశాలోని ‘బాలాసోర్ దగ్గర మూడు రైళ్లు ఢీకొన్న క్రమంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 293 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు బదులుగా గూడ్స్ రైలు ఆగి ఉన్న లూప్‌లోకి ప్రవేశించి అక్కడే నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది, పక్కకి ఒరిగి పోయింది. ఇక ఆ తరువాత, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా బోల్తా పడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొంది.

Poonam Kaur: గురుపౌర్ణమి రోజు ”గురు”వును ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

ఇక సిఆర్‌ఎస్ విచారణతో పాటు రైలు ప్రమాదంపై సిబిఐ కూడా విచారణ జరుపుతోంది. ప్రమాదం తర్వాత, ఆగ్నేయ రైల్వేకు చెందిన పలువురు ఉన్నతాధికారులను రైల్వే శాఖ బదిలీ కూడా చేసింది. రైలు ప్రమాదానికి సిగ్నల్స్‌ విషయంలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక జోక్యమే కారణమని ప్రాథమిక విచారణ సూచించింది. ఇక ఆ సంగతి అలా ఉండగానే సరిగ్గా అదే తరహా ఘోర దుర్ఘటన జరగబోతోందని అంటూ సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులకు తాజాగా ఒక బెదిరింపు లేఖ అందింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ లేఖను రైల్వే అధికారులకు పంపించాడని చెబుతున్నారు. హైదరాబాద్- ఢిల్లీ మార్గంలో బాలాసోర్ తరహా ప్రమాదం జరగనుందని, ఇది విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అని చెబుతూ ఈ లేఖను రాశారు.

Warning Letter