Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- రాాజీనామా చేసిన 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- ఆయన రాజకీయ ఉద్యమానికి 14 లక్షల మంది సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో అన్నామలైకి అపూర్వ మద్దతు లభిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆయన రాజకీయ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బీజేపీకి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత దాదాపుగా 14 లక్షల మంది ఆయన ప్రారంభించిన ఉద్యమంలో చేరారు. జూన్ 5న బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, కొత్తగా రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, తనకు పార్టీతో 18 నెలలుగా విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాలపై తన అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు ఒకేలా ఉండవని చెప్పారు. తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రజా కేంద్రిత రాజకీయల కొత్తదశగా అన్నామలై పేర్కొన్నారు. యువత, సాధారణ ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు కొద్ది మంది కుటుంబాలకో, శాశ్వత ఎమ్మెల్యేలు, ఎంపీలకో పరిమిత కాకూడదని, రాజకీయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. వ్యక్తిపూజ, వంశపారంపర్య రాజకీయాలను ముగించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అన్నామలై ప్రారంభించిన ‘‘వి ద లీడర్’’ అనే రాజకీయ ఉద్యమానికి అపూర్వ స్పందన వస్తోంది. ఈ ఉద్యమానికి సంబంధించిన వెబ్సైట్ ప్రకారం.. 14 లక్షల మంది సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విద్యా, ఆరోగ్యం, పర్యావరణం, యువ నాయకత్వం వంటి రంగాల్లో సేవ చేయాలనుకున స్వచ్ఛంద కార్యకర్తలను ఈ ఉద్యమం ఆహ్వానిస్తుంది. కొత్త ఉద్యమం ద్వారా తమిళనాడులో జరిగే తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నామలై ప్రకటించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!