Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
- అన్నామలై రాజీనామా వార్తలతో రాజకీయాల్లో కలకలం
- ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక భేటీ
- అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అన్నామలై
- ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదని వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: అన్నామలై వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని బీజేపీ గానీ, అన్నామలై కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆయన పార్టీలో ఉన్నారా? బయటకు వెళ్లారా.? అనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ వైఖరి పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో సహా బీజేపీ అగ్ర నాయకులను కలిశారు.
అన్నామలై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంకా రాజీనామా చేయలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం పార్టీ అగ్రనేతల్ని కలిసిన అన్నామలై, తమిళనాడులో బీజేపీ పనితీరుపై తనకు ఉన్న అభ్యంతరాలను వారికి వివరించారు. ఇటీవల ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వల్ల పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడినట్లు తెలిపారు. బీజేపీ సొంతంగా బలం పెంచుకోవాలని అన్నామలై తొలి నుంచి వాదిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుపై ఆయన అయిష్టంగానే ఉన్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు పొత్తు కుదరాలంటే అన్నామలైని బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే షరతు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇదే సమయంలో కొంత మంది బీజేపీ, అన్నాడీఎంకే నాయకుల వైఖరి పట్ల అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన లేవనెత్తిన అంశాలను రాష్ట్ర నాయకులతో చర్చిస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సమావేశంలో అన్నామలై రాజీనామా అంశంపై చర్చ జరగలేదని తెలుస్తోంది. తమిళనాడులో ప్రజా సంబంధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు అన్నామలై చేస్తున్న ప్రణాళికలకు సహకరిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అన్నామలై లేవనెత్తిన విషయాలను చర్చించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ను ఢిల్లీకి పిలిపించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..