Site icon NTV Telugu

ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే

ప్రముఖ సామాజిక సేవా కర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే అస్వస్థతకు గురికావడంతో గురువారం నాడు ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఛాతి నొప్పితో బాధపడుతుండటంతో హజారే పూణెలోని రుబె హాల్ క్లినిక్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ మేరకు అన్నా హజారేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెలోని కరోనరీ ఆర్టెరీలో ఏర్పడిన బ్లాకేజీని తొలగించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్ డాక్టర్ అవధూత్ వెల్లడించారు.

Read Also: తాజా స‌ర్వే: దేశంలో పెరిగిన మ‌హిళ‌ల రేషియో

కాగా 84 ఏళ్ల అన్నా హజారేకు రెండు, మూడు రోజులుగా ఛాతిలో నొప్పి వస్తోందని, అందుకే వైద్యుల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారని రుబె హాల్ క్లినిక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు హజారే ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోందని… రెండు రోజుల అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశముందని వారు పేర్కొన్నారు.

Exit mobile version