క్షణిక సుఖం కోసం కొంత మంది మహిళలు అడ్డదారులు తొక్కుతున్నారు. కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. మధ్యలో పరిచయం అయిన వాళ్ల కోసం కట్టుకున్న వాళ్లనే కడతేరుస్తున్నారు. జైల్లో చిప్పకూడు తినాల్సిన దుస్థితి వస్తుందని తెలిసి కూడా ఘాతుకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
రమాకాంత్ పాఠక్, సాధన శర్మ భార్యాభర్తలు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో రమాకాంత్ పాఠక్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా.. సాధన శర్మ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తోంది. రమాకాంత్ ఇంటి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంకు ఉంది. రోజూ సాధన శర్మ ఆ పెట్రోల్ బంకు ఎదురుగానే వెళ్తుండేది. ఈ క్రమంలో పెట్రోల్ బంకులో పని చేసే కార్మికుడు మనీష్ జాతవ్ (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర నుంచి ఇద్దరి మధ్య ఏకాంతం పెరిగింది. భర్త లేని సమయంలో ఇద్దరూ ఇంట్లో కలుసుకునే వారు. ఒకరోజు భర్త రమాకాంత్ కంట్లో పడ్డారు. దీంతో తీరు మార్చుకోవాలని భర్త హెచ్చరించాడు. అయినా కూడా బుద్ధి మార్చుకోలేదు. ప్రియుడితోనే తిరుగుతోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. దీంతో భర్తను అంతమొందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో మనీష్‌తో కలిసి స్కెచ్ వేసింది. దీనికి మనీష్ స్నేహితుడైన సత్నం సాయం కోరాడు. అయితే రమాకాంత్ పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకు దగ్గరకు రావడంతో సత్నం పరిచయం పెంచుకున్నాడు. నమ్మకం కుదిరాక బయటకు వెళ్దామంటూ కారులో రమాకాంత్‌ను మనీష్, సత్నం తీసుకెళ్లారు. నాన్‌పూర్ వ్యాలీ దగ్గరకు తీసుకెళ్లాక రమాకాంత్‌ను చంపేసి లోయలో పడేశారు. అనంతరం బైక్‌ను తీసుకొచ్చి మృతదేహం దగ్గర పడేశారు.
డిసెంబర్ 27, 2025న నాన్‌పురా లోయలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించి దర్యాప్తు చేపట్టారు.
ఇక భార్య సాధన శర్మను స్టేషన్‌కు పిలిచి విచారించగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా ఇతరులతో మాట్లాడినట్లుగా తేలింది. దీంతో ఆ దిశగా విచారించగా పొంతన లేని సమాధానం చెప్పింది. మరింత నిలదీయగా ప్రియుడితో కలిసి చంపినట్లుగా నేరాన్ని అంగీకరించింది. మొబైల్ ఫోన్లు, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నెలన్నర క్రితం ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితులు మనీష్, సత్నంను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
