Aditya-L1: ఇప్పటి వరకు చంద్రుడిపై రహస్యాలను శోధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఇకపై సూర్యుడి రహస్యాలను చేధించడం కోసం ప్రయత్నాలు మొదటి పెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను చేయడానికి ఇస్రో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. అదే జోష్‌లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తరువాత తదుపరి మిషన్‌కు సిద్ధమవుతోంది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. ఇందుకోసం ఆదిత్య L1 రాకెట్‌ను లాంచ్ చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుంది. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్‌లో ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. ఆదిత్య ఎల్1 ప్రయోగంలో శాటిలైట్‌ను సెప్టెంబర్ మొదటివారంలో పీఎస్‌ఎల్వీ సీ57 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నది. సూర్యుడి పుట్టుక, వాతావరణం గురించి లోతైన అధ్యయనం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
Read also:SpiceJet Independence Day 2023 Sale: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.1,515కే ఫ్లైట్ టిక్కెట్!
చందమామ రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనే లక్ష్యంతో ఇస్రో చంద్రయాన్ -3ని జూలై 14న ప్రారంభించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3కి సంబంధించిన ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగనుంది. ఈ క్రమంలోనే ఇస్రో తమ ప్రయోగాల స్పీడ్‌ను మరింత పెంచింది. ఆదిత్య L1 ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేసి.. అక్కడి నుంచి షార్‌కు తీసుకువచ్చారు. బెంగళూరులోనే వివిధ పరీక్షలు నిర్వహించి.. ప్రత్యేక వాహనంలో షార్‌కు తరలించారు. సెప్టెంబరు మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. షార్‌లోని ఆదిత్య L1 రాకెట్‌కు సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేరుదో కొరొనా, చిత్రాలు తీయడం, స్పెక్ట్రోస్కోపి, కొరోనల్ మాస్ ఎజెక్షన్‌పై దృష్టి సారిస్తుంది. అలాగే సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్‌తో ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌పై పరిశోధనలు చేయడం.. సోలార్ లో ఎనర్జీ ఎక్స్- రే స్పెక్ట్రోమీటర్ ద్వారా సూర్యుడిపై ఏర్పడే మృదువైన, కఠినమైన ఎక్స్-రే మంటలపై అధ్యయనం చేయనున్నారు. హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌తో సూర్యుడిపై ఏర్పడే మృదువైన, కఠినమైన ఎక్స్-రే మంటలపై అధ్యయనం చేస్తుంది. సౌర గాలిలో ఉండే ప్రొటాన్లు, ఎలక్ట్రాన్లు, అయాన్లపై ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పేరుతో పరిశోధనలు చేస్తుంది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ సూర్యుడి భావ్య వలయంపై దృష్టి పెడుతుంని .. ఈ ప్రయోగం ద్వారా కొరోనల్ హీటింగ్, కొరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రి-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
