Site icon NTV Telugu

Anand Mahindra: డ్రోన్‌ను మింగేసిన మొసలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన ఆనంద్ మహీంద్రా వ్యాపారం రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటారు. స్పూర్తినిచ్చే ప్రతీ అంశంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఇలాంటి అంశంపైనే ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ‘‘ టెక్నాలజీపై ప్రకృతిదే విజయం’’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పదివేల మంది ఈ వీడియోకు లైక్స్ కొట్టగా.. ఏకంగా 5 లక్షల వ్యూస్ వచ్చాయి.

Read Also: Dawood Ibrahim: కరాచీ ఎయిర్‌పోర్టును ఏలుతున్న అండర్ వరల్డ్ డాన్.. ఎన్ఐఏ సంచలన రిపోర్ట్

ఓ సరస్సు వద్ద డ్రోన్ తో షూట్ చేస్తున్న సమయంలో ఓ చిన్న మొసలి దాన్ని తదేకంగా చూస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరి డ్రోన్ ను నోట కరుచుకుని నీటిలోకి వెళ్లిపోతుంది. నాచురల్ వరల్డ్ ఎల్లప్పుడు టెక్నాలజీపై ఆధిక్యతను ప్రదర్శిస్తుందనే దానికి ఇదే ఉదాహరణ అని ఆయన ట్వీట్ చేశారు. నీటిపై ఉన్న డ్రోన్ ను వెంటాడుతూ, చివరకు దాన్ని ఎగిరి నోటితో పట్టుకుంటుంది. డ్రోన్ పైకెగిరే ప్రయత్నం చేసినా.. క్షణాల్లో దాన్ని పట్టుకుంటుంది మొసలి. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నిజమే సార్ అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేయాగా.. మరొకరు ఇది మహీంద్రా థార్ కన్నా స్పీడ్ గా ఉన్న డ్రోన్ మొసలి నుంచి తప్పించుకోలేకపోయిందని, మొసలికి కొత్త డ్రోన్ వచ్చిందంటూ మరో నెటిజన్ ఫన్నీగా రిఫ్లై ఇచ్చాడు.

Exit mobile version