NTV Telugu Site icon

Anand Mahindra: ఫొటో చూసి వణికిపోయిన ఆనంద్‌ మహీంద్రా.. నేనంత ధైర్యం చేయలేను, ఆ రోడ్‌లో వెళ్లే ప్రసక్తే లేదు..!

Anand Mahindra

Anand Mahindra

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్‌ ఆనంద్ మహీంద్రా.. బిజినెస్‌లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.. కొన్ని సార్లు ఆయన షేర్ చేసే ఫొటోలు, వీడియలో.. నవ్వు పుట్టిస్తాయి.. ఆలోచింపజేస్తాయి, విజ్ఞానాన్ని పంచుతాయి.. ఔరా! అనిపిస్తుంటాయి.. ఇలా ఎప్పుడూ తన ఫాలోవర్ల మెదడుకు పదును పెడుతూనే ఉంటారు.. అంతేకాదు.. కష్టమంటూ ట్వీట్‌ చేసినవారికి తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మన మహేంద్రుడి ఖాతాలో.. కొన్ని సార్లు ఘాటైన రిప్లేలు కూడా ఇస్తుంటారు.. తాజాగా ఆనంద్‌ మహీంద్రా ఓ ట్వీట్‌ను రిట్వీట్‌ చేస్తూ పెట్టిన కామెంట్ వైరల్‌గా మారిపోయింది..

Read Also: Marriage Contract: భర్తకు భలే ఆఫర్‌.. పెళ్లిలోనే బాండ్‌ రాసిచ్చిన వధువు

@TravelingBharat అనే ట్విట్టర్‌ ఖాతాలో ప్రతి సాహస ప్రియులు తప్పక సందర్శించాల్సిన భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన మరియు అందమైన టాప్‌ 10 రోడ్లు అంటూ.. ఫొటోలను షేర్‌ చేశారు.. ఆ రోడ్లు ఉన్న ప్రాంతాలు, రాష్ట్రాలను కూడా పేర్కొంటూ.. ఫొటోలను పంచుకున్నారు.. ఆ ఫొటోలను చూస్తుంటే.. అద్భుతమైన ప్రదేశాలతో పాటు.. ఆ రోడ్‌లో ప్రయాణం అంటే నిజంగా సాహసమే.. వెళ్తే వస్తామా? అనే గ్యారంటీ కూడా కనిపించడంలేదు.. ఎత్తైన ప్రాంతానికి కొండల మధ్య నుంచి వెళ్లే రోడ్లు ఎంతగా ఆకట్టుకుంటున్నాయో… ఎప్పుడూ కొండ ప్రాంతాల్లో వెళ్లనవారిని అంతలా భయపెడుతున్నాయి కూడా.. ఇక, ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా.. ‘ఇంతటి అద్భు తమైన ఫోటోని షేర్ చేసినందుకు.. ట్రావెలింగ్‌ భారత్‌ అనే ట్విట్టర్‌ ఖాతాను ధన్యవాదాలు తెలిపారు.. మీరు పంచుకున్న జాబితా నా లిస్ట్‌లో ఉంచుతాను.. కానీ, ఆ రహదారిలో వెళ్లే ప్రసక్తే లేదు.. ఒప్ప కుంటున్నా, నేనంత ధైర్యం చేయలేనని’ కామెంట్‌ రాసుకొచ్చారు.. మహీంద్ర ట్వీట్‌ కాస్తా వైరల్‌గా మారిపోయింది.. నెటిజన్లు తాము పర్వత ప్రాంతంలో ప్రయాణం చేసినప్పుడు ఎదురైన అనుభవానలు ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ కింద పంచుకుంటున్నారు.

Show comments