NTV Telugu Site icon

Anand Mahindra: ఆశీర్వాదం అడిగిన వినియోగదారుడికి ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: మహీంద్ర గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒక్క వ్యాపారంలోనే కాదు నెట్టింట కూడా చురుకుగా ఉంటారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆనంద్‌ మహీంద్రా తమ కస్టమర్‌ ట్వీట్‌కు స్పందించి మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నారు. చాలా మంది కష్టపడి పనిచేసి సొంతంగా కారు కొనుక్కోవాలనే ఓ కల ఉంటుంది. కారు కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును ఆదా చేసి కారును సొంతం చేసుకుంటారు. ఆ కల సాకారమైన వేళ దానిని నలుగురితో పంచుకుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా కారు కంపెనీ యజమానీతోనే ఈ ఆనందాన్ని పంచుకోవడం విశేషంగా నిలిచింది. ఆశీర్వదించండి అని కోరిన వినియోగదారుడికి అభినందనలు తెలుపుతూ ఆనంద్‌ మహీంద్రా స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అసలేం జరిగిందంటే.. అశోక్‌ కుమార్ అనే వ్యక్తి ఇటీవల మహీంద్రా XUV700ని కొనుగోలు చేశాడు. ఈ ఆనందాన్ని మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాతో పంచుకోవాలనుకున్నారు. మహీంద్ర ఎస్‌యూవీతో ఫోటోను పోస్ట్‌ చేస్తూ..”10 సంవత్సరాలు కష్టపడి కొత్త మహీంద్రా XUV 700ని కొనుగోలు చేశా.. సార్ మీ ఆశీర్వాదం కావాలి.”అంటూ ఆ పోస్ట్‌ను ఆనంద్‌ మహీంద్రాకు ట్యాగ్ చేశారు.

Rs 2,000 notes: రూ.2 వేల నోట్లపై అసలు విషయం బయటపడింది..!

ఈ పోస్ట్‌పై రెండు రోజుల తర్వాత ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆయన దానికి స్పందనగా ట్వీట్ చేశారు. “ధన్యవాదాలు, కానీ వాస్తవానికి మా కంపెనీ కారుఎంచుకుని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే! కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్” అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ అశోక్ కుమార్ ధన్యవాదాలు తెలిపాడు. ఆనంద్ మహీంద్రా ప్రతిస్పందన కేవలం అశోక్‌కుమార్‌ను మాత్రమే కాకుండా.. అనేక మంది ట్విట్టర్ వినియోగదారులను కదిలించింది. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందంటూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు. ‘మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని ఒ​క వినియోగదారుడు కామెంట్‌ చేశారు.

Show comments