Site icon NTV Telugu

Trending Video: ఆటోని అచ్చం కారులా మార్చేసుకున్న బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. ఎక్కామంటే..!

Auto

Auto

Trending Video: ఆ ఆటోలో కూర్చుంటే కారులో ప్రయాణించినట్టే ఉంటుంది. కారులో ఉన్న సీటింగ్, కారులో ఉండే సౌకర్యాలను ఆటోలో పెట్టాడు ఓ ఆటో డ్రైవర్. పాపం కారుతీసుకునే స్తోమత లేదో.. లేకుంటే ప్రయాణికులు తన ఆటోలో కూర్చుంటే కారులో కూర్చున్నామన్న ఫీలింగ్ రావాలనో తెలియదు గానీ.. అచ్చం కారులాగే డెకరేట్ చేశాడు.

Read Also: Gadikota Srikanth Reddy: రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ మోసం.. మూడు సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు..?

తనకున్న తెలివితేటలు, పట్టుదలతో ఆటోను కారులా మార్చాడు ఓ ఆటో డ్రైవర్. కానీ కారులో ప్రయాణిస్తే మెత్తగా, స్మూత్ గా ఉంటుంది. ఎంత దూరం ప్రయాణం చేసినా అలసట అనేది రాదు. అదే ఆటోలో అయితే ఒళ్లు నొప్పులస్తాయి. అదే ఇక గుంతల రోడ్డు ఐతే నరకానికి దారివెతుకున్నట్లు ఉంటుంది అందులో ప్రయాణం. ఎందుకంటే ఆటోలో సీట్లు అలా ఉంటాయి కాబట్టి.

Read Also: Google: మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. వినూత్నంగా ఆలోచించి తన ఆటోని కారులా మార్చేశాడు. డబ్బులు ఖర్చు అయినా ఓకే కానీ.. అతని కలను నిజం చేసుకున్నాడు. అయితే ఆ ఆటో లోపల స్పెషల్ గా అచ్చం కారులా మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారులో ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలా కొత్తగా ఆలోచించిన ఆటో డ్రైవర్ ను పలువురు అభినందిస్తున్నారు. మీ ఆలోచనలకు సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

Exit mobile version