Site icon NTV Telugu

Amruta: నా భర్త పిక్నిక్‌ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్

Amruta Fadnavis4

Amruta Fadnavis4

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌లో పర్యటిస్తున్నారు. అయితే ఫడ్నవిస్ పర్యటనను శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ దావోస్‌కు పిక్నిక్‌కి వెళ్లారంటూ విమర్శించారు. అంతేకాకుండా దావోస్‌ను సందర్శించిన ప్రభుత్వ పెద్దల ఖర్చులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులంతా దావోస్‌లో పిక్నిక్‌ మూడ్‌ను ఆస్వాదిస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Trump-Europeans: సుంకాలపై యూటర్న్.. యూరోపియన్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్

తాజాగా సంజయ్ రౌత్ ఆరోపణలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత కౌంటర్ ఎటాక్ చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తన భర్త దావోస్‌కు పిక్నిక్‌కు వెళ్లలేదని.. మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి.. అనేక మంది ఉపాధి కల్పించడానికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని అమృత పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మేయర్ పీఠం కోసం ఇంకా తర్జన భర్జన జరుగుతోంది. ప్రస్తుతం ఫడ్నవిస్ దావోస్ పర్యటనలో ఉండడంతో ఇంకా ఎటూ తేలలేదు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటింది. అన్ని చోట్ల ఘన విజయాలు సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి: Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి

Exit mobile version