NTV Telugu Site icon

Train Video: అమృత్సర్-కతిహార్ రైల్లో దారుణం.. ప్రయాణికుడ్ని దారుణంగా కొట్టిన టీటీఈ

Attack Passenger

Attack Passenger

ట్రైన్‌లో ప్రయాణికులకు-టికెట్ అధికారి మధ్య చిన్న పాటి ఘర్షణలు సహజంగానే జరుగుతుంటాయి. సీటు విషయంలోనో.. లేదంటే వెయిటింగ్ లిస్టు విషయంలోనో.. గొడవలు జరుగుతుంటాయి. ప్రయాణికులకు సర్ది చెప్పడమో.. లేదంటే పోలీసులను పిలిచి పరిష్కరించుకోవడమో జరుగుతుంటాయి. అంతమాత్రాన భౌతికదాడులకు దిగడం ఏ మాత్రం భావ్యం కాదు. పిల్లలు, పెద్దలు, మహిళలు, కుటుంబాలతో కలిసి ప్రయాణం చేస్తుంటారు. ఏదైనా జరిగితే హడలెత్తిపోతారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అలాంటి భయాందోళన కలిగిస్తోంది. అందులో టీటీఈ తీరు మరీ భయంకరంగా ఉంది. అధికారినా? లేదంటే వీధి రౌడీనా? అర్థం కాలేదు. ట్రైన్ అంటేనే భయపడే విధంగా అతడి తీరు కనిపించింది. అసలేం జరిగిందో ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: KTR: ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ..

అమృత్సర్ నుంచి కతిహార్‌కు ట్రైన్ వెళ్తోంది. బోగీలో బాత్రూమ్స్ ఉండే చోట.. ఒక ప్రయాణికుడిని టీటీఈ, కోచ్ అటెండెంట్ అత్యంత దారుణంగా హింసించారు. ప్రయాణికుడి పీకపై టీటీఈ కూర్చుని.. ఊపిరాడక కుండా చేస్తే.. ఇంకో వైపు కోచ్ అటెండెంట్ బెల్టు తీసుకుని ఇష్టానురీతిగా కొడుతూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా టీటీఈ బూటు కాళ్లతో ప్రయాణికుడి నడుముపై పదే పదే జంప్ చేస్తూ కనిపించాడు. ఇంకోవైపు బెల్టుతో కొడుతూనే ఉన్నాడు. అయితే ప్రయాణికుడిలో మాత్రం స్పృహ ఉన్నట్లు కనిపించలేదు. కదలకుండా చేశారు. అతడి ప్యాంట్ కూడా తీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ దృశ్యాలు ఎవరో రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో లక్నో డీఆర్‌ఎం దృష్టికి వెళ్లగా.. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Pune: నాన్నకు అనారోగ్యమని అబద్ధం.. మహిళ సహోద్యోగిని చంపిన వ్యక్తి..

అయితే వీడియోలో ప్రయాణికుడిని టికెట్ అధికారి తిడుతున్నట్లుగా కూడా ఉంది. బూతు మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీటీఈ.. అధికారినా? లేదంటే వీధి రౌడీనా? అంటూ నిలదీస్తున్నారు. ప్రయాణికుడు ఏదైనా తప్పు చేస్తే.. పోలీసులను పిలవాలి గానీ.. ఇలా దాడులు చేయడమేంటి? అని నిలదీస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. అసలేం జరిగిందో కూడా అధికారిక ప్రకటన రైల్వే శాఖ నుంచి వెలువడలేదు.

 

Show comments