NTV Telugu Site icon

Amritpal Singh: స్వర్ణ దేవాలయం వద్ద లొంగిపోనున్న అమృత్ పాల్ సింగ్.. సిక్కులు యూనిటీ ఉండాలని వీడియో

Amrit Pal

Amrit Pal

Amritpal Singh:పరారీలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పంజాబ్ కు అతడు వచ్చినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు వస్తున్నట్టు సమాచారం. మార్చి 18న భారీ ఆపరేషన్ నిర్వహించిన పంజాబ్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు గత 12 రోజులగా ప్రయత్నిస్తున్నారు. అయితే హర్యానా మీదుగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read Also: Rahul Gandhi: ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలతో అనర్హుడయ్యాడో.. అక్కడి నుంచే రాహుల్ ప్రచారం..

ఇదిలా ఉంటే తాజాగా అమృత్ పాల్ సింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. బైసాఖిలో సర్బత్ ఖల్సా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు, సిక్కు సంస్థలకు అమృత్ పాల్ కోరారు. చాలా కాలంగా చిన్న సమస్యలపై పోరాటాలు చేయడంతో మునిగిపోయామని, పంజాబ్ సమస్యలు పరిష్కరించాలంటే మనం కలిసి ఉండాలని, సిక్కులందరూ ఐక్యమత్యంతో ఉండాలని వీడియోలో చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఎందరో కార్యకర్తలను అరెస్ట్ చేసిందని, ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్నారని, కొందర్ని అస్సాంకు తరలించారని వీడియోలో అమృత్ పాల్ సింగ్ అన్నారు.

స్వయం ప్రకటిత బోధకుడిగా తనను తాను ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ పంజాబ్ లో వేర్పాటువాదాన్ని పెంచిపోషించాలని అనుకున్నాడు. గత ఫిబ్రవరిలో ఏకంగా తన అనుచరుడిని విడిపించుకోవడానికి అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్పీతో పాటు పలువురు పోలీసులపై దాడి చేశాడు. దీంతో పంజాబ్ ప్రభుత్వం అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించింది. అయితే గత 12 రోజులుగా తప్పించుకుతిరుగున్న అమృత్ పాల్ సింగ్ లొంగుబాటుకు సిద్ధం అయ్యాడు. అతడికి, అతడి అనుచరులకు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వెలుగులోకి తీసుకువచ్చింది.

Show comments