Site icon NTV Telugu

UP: లక్నో అమిటీ వర్సిటీలో దారుణం.. సహచర విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన స్నేహితులు

Up

Up

పాఠశాల అన్నాక.. కాలేజీ అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ ఈ మధ్య అవి మరింత శృతిమించుతున్నాయి. ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ ఒక విద్యార్థిని సహచర విద్యార్థులు చెంపదెబ్బలతో వాయించేశారు. కొట్టొద్దంటూ వేడుకున్నా వదిలిపెట్టకుండా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో అమిటీ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: UP: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా.. 3 రెట్ల జీతం పెంపు

లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయంలో శిఖర్ ముఖేష్ కేసర్వానీ అనే విద్యార్థి రెండో సంవత్సరం లా చదువుతున్నాడు. అయితే శిఖర్‌ను అతని సహవిద్యార్థులు వర్సిటీ పార్కింగ్ స్థలంలో వాహనంలోకి ఎక్కించుకు ‘‘50-60’’ సార్లు చెంపదెబ్బలు కొట్టారు. వారి మధ్య గొడవకు గల కారణాలేంటో తెలియదు గానీ.. ఇష్టానురీతిగా దాడి చేశారు. ఆగస్టు 26న జరిగిన ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తన కొడుకును దారుణంగా కొట్టారని.. అంతేకాకుండా క్యాంపస్‌ నుంచి వెళ్లిపోవాలని బెదిరించడమే కాకుండా.. తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తమ బిడ్డ క్యాంపస్‌లో చదవడం లేదని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: UK: యూకే చరిత్రలో సరికొత్త అధ్యయనం.. హోం కార్యదర్శిగా ముస్లిం మహిళ నియామకం

శిఖర్ తండ్రి ముఖేష్ కేసర్వానీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు విద్యార్థులు ఆయుష్ యాదవ్, జాన్వి మిశ్రా, మిలే బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమాన్ శుక్లా పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇక ఈ దాడి గురించి యూనివర్సిటీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Exit mobile version