Site icon NTV Telugu

Amit Shah: చిన్ననాటి ముద్దు పేరును బయటపెట్టిన అమిత్ షా

Amitshah

Amitshah

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన చిన్ననాటి ముద్దు పేరును బయటపెట్టారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. చిన్నప్పుడు తనను ‘‘పూనమ్’’ అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లు నిండిన తర్వాత పేరు పెట్టాలనుకున్నారని.. శరద్ పూర్ణిమ నాడు పుట్టానని.. అందరూ తనను పూనమ్ అని పిలిచేవారని అమిత్ షా చెప్పుకొచ్చారు. గ్రామాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఇది సర్వసాధారణ విషయమేనని తెలిపారు. ఇందులో పెద్ద రహస్యమేమి లేదన్నారు.

తల్లిదండ్రులు అమెరికా పంపాలని నిర్ణయించినప్పుడు 11 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయారా? అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ.. దేశాన్ని విడిచి వెళ్లే అవకాశమే లేదన్నారు. ఇక్కడే ఉంటాను.. ఇక్కడే పోరాడతానని తెలిపారు.

ఇది కూడా చదవండి: TDP: వైఎస్‌ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్తపై అధిష్టానం చర్యలు..

వక్ఫ్ చట్టం, సీఏఏ, నక్సలిజంపై కూడా స్పందించారు. బుజ్జగింపులకు పాల్పడేవారు దేశ వ్యతిరేకులు అని పేర్కొన్నారు. ఇది విషపూరితమైన భావజాలం అన్నారు. దేశ విభజనకు కారణం ఎవరిని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కాంగ్రెస్‌లో ఒక్క నాయకుడు అని ప్రత్యేకంగా చెప్పడం కష్టం అన్నారు. కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి ఎంపిక వేరేగా ఉంటుంది.. అదే బీజేపీలో అయితే మోడీ అత్యున్నత నాయకుడు కాబట్టి ప్రధాని అయ్యారన్నారు.

ఇది కూడా చదవండి: Jack Review: సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రివ్యూ

2014లో ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ వక్ఫ్ బిల్లులో మార్పులు తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుత బిల్లు ముస్లిం సమాజంలో కొంతమంది నాయకులకు మాత్రమే ఇష్టం లేదన్నారు. దీనిపై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారిస్తుందని చెప్పారు. అయినా వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రియాంక ఎందుకు తప్పించుకున్నారని ఆరోపించారు. ఇక ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అమెరికా అప్పగించడం మోడీ సాధించిన గొప్ప దౌత్య విజయంగా అమిత్ షా చెప్పుకొచ్చారు.

 

Exit mobile version