Site icon NTV Telugu

Amit Shah: ప్రధాని మోడీ రామమందిరాన్ని నిర్మించారు, 5జీని తీసుకొచ్చారు.

Amitshah

Amitshah

Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యంలో రామమందిరాన్ని నిర్మించారని, దేశంలోకి 5జీని తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్నవారు రామమందిరాన్ని నిర్మించడం వల్ల ఏమి మంచి జరిగిందని అడుగుతారు. వారికి అర్థం కాకపోవచ్చు. మోడీ జీ రామాలయాన్ని నిర్మించారు, భారతదేశానికి 5Gని తీసుకువచ్చారు. వీధిలో కూరగాయల విక్రేత కూడా డిజిటల్ చెల్లింపులు చేసే స్థాయికి ఆయన తీసుకెళ్లారు’’ అని ఆదివారం జరిగిన భారత్ వికాస్ పరిషత్ (BVP) 63వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన సందర్భంగా అమిత్ షా అన్నారు.

Read Also: Baba Vanga : బాబా వంగా మరో సంచలనం.. 2025 రెండోార్థంలో ఈ మూడు రాశులవారికి అదృష్టమే అదృష్టం..!

వలస రాజ్యాల గుర్తులను, భారతీయ గుర్తులతో భర్తీ చేడయంతో పాటు ఎయిమ్స్, ఐఐటీలను పెంచడం, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడం వంటి వాటిని అమిత్ షా హైలెట్ చేశారు. స్వామి వివేకానంద స్పూర్తితో బీవీపీ నిస్వార్థ సేవల్ని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా, విపత్తుల సమయంలో అంకితభావంతో సేవలందించడాన్ని ఆయన కొనియాడారు. ఇది కేవలం సంస్థ కాదని, ఇది భారతీయుల గుర్తింపుతో అనుసంధానించే ఆలోచన అన్నారు.

Exit mobile version