Site icon NTV Telugu

Amit Shah: సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి.. ఆర్మీకి అమిత్ షా ఆదేశాలు..

Amithshah

Amithshah

Amit Shah: పహల్గాం ఉగ్ర దాడికి భారత బలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరిట తొమ్మిది ఉగ్ర స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారు జామున విరుచుకుపడ్డాయి. ఈ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో సుమారు పది మంది భారతీయ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే, పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు కేంద్రమంత్రి అమిత్‌ షా ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Sophia Qureshi: కసబ్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు..

అయితే, గత నెలలో విహార యాత్రకు వెళ్లిన టూరిస్టులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీశారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పై అన్ని వైపులా భారత్ ఒత్తిడి తీసుకురావడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, భద్రతా బలగాలను పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు దేశ ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version