NTV Telugu Site icon

Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశానికి ప్రధాని అయ్యారు.. మోడీ 100 రోజుల పాలనపై అమిత్ షా వ్యాఖ్యలు..

Amit Shah

Amit Shah

Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు తాము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అమిత్ షా వివరించారు. మోడీ జీ నాయకత్వంలో 10 సంవత్సరాలలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులు రక్షణ మరింత బలోపేతమైందని చెప్పారు.

విద్యను ఆధునికంగా, అందరిని కలుపుకునిపోయేలా తీర్చిద్దారని, అంతరిక్ష రంగంలో భారత భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని షా అన్నారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, కరెంటు, నీరు, ఆరోగ్య సేవలు, ధాన్యం పంపిణీ చేశారని చెప్పారు. 100 రోజుల్లో రూ.15 లక్షల కోట్లతో ప్రాజెక్టులు అమలు చేశామని, 25 వేల కోట్ల గ్రామాలను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. బనారస్, బిహ్తా సహా 5 కొత్త ఏయిర్ స్ట్రిప్‌ల నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. 12.33 కోట్ల మంది రైతులకు సమ్మాన్‌ నిధి కింద రూ.3 లక్షల కోట్లు అందించామని వెల్లడించారు.

Read Also: Hardeep Singh Puri: రాహుల్ గాంధీది “పాకిస్తాన్ జాతిపిత” మనస్తత్వం.. కేంద్రమంత్రి ఫైర్..

మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతోందని, ఈ సందర్భంగా దేశం కోసం రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. వారణాసి, బాగ్‌డోగ్రా, బీహార్ విమానాశ్రయాలలో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లు నిర్మించబడ్డాయని, బెంగళూర్ మెట్రోని విస్తరించినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర పెంచామని, యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మద్దతు ధరతో పంటల్ని కొనుగోలు చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లు నిర్మించాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 పారిశ్రామిక మండలాలు ఏర్పాటు చేయడంతో పాటు ముద్రా రుణాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. యువతకు నేరుగా ప్రయోజనం చేకూర్చే 2 లక్షల కోట్ల రూపాయల ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించాం. దీంతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా ఇళ్లకు సౌరశక్తి అందుతోంది.. పీఎం ఈ-బస్ సర్వీస్ ప్రారంభమైందని, స్టార్టప్స్‌పై 31 శాతం అనవసర పన్ను తొలగించామని చెప్పారు.