NTV Telugu Site icon

Amit Shah: కాంగ్రెస్ దేశం నుంచి తుడిచిపెట్టుకుపోతోంది.. బీజేపీదే భవిష్యత్తు

Home Minister Amit Shah

Home Minister Amit Shah

Amit Shah comments on congress party: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరగువుతోందని.. ఇక భవిష్యత్తు అంతా బీజేపీదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేరళ వెళ్లిన ఆయన సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భారత దేశం నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోందని ఆయన అన్నారు.

బీజేపీ ఎస్సీ సెల్ సదస్సులో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీనే భవిష్యత్తు అని.. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు అంతమైపోతున్నాయని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు అంతరించిపోయే దశలో ఉన్నాయని అన్నారు. కేరళలో బీజేపీ పార్టీకే భవిష్యత్తు ఉందని తిరువనంతపురం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

Read Also: Asaduddin Owaisi: అమిత్ షా, కేసీఆర్‌లకు లేఖలు.. పాతబస్తీలో సెప్టెంబర్ 17న తిరంగా యాత్ర

వెనకబడిన, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అమిత్ షా కొనియాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం ఎప్పుడూ పనిచేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే పరిగణించారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. కేరళలో దేశం కోసం పనిచేయాలంటే దేశభక్తి, త్యాగం, ధైర్యం కావాలని ఆయన అన్నారు.

కేరళలో బీజేపీ బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కేరళ ప్రజలు మాత్రం అయితే.. కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులకు పట్టం కడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం సీట్లు రాకపోయినా.. బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. దీంతో పాటు కమ్యూనిస్టులను ధీటుగా బీజేపీ నిలబడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలయ హత్యలు కూడా జరుగుతున్నాయి.