Amit Shah: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహూకరించిన గమోసాను ధరించడాని నిరాకరిచడం ద్వారా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అస్సామీ వస్త్ర సంప్రదాయాన్ని అగౌరపరిచారని హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఆరోపించారు. రాహుల్ గాంధీ తనకు నచ్చింది చేసుకోవచ్చు, కానీ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ఏ మాత్రం అగౌరవపరిచినా సహించమని హెచ్చరించారు.
Read Also: Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో సెలబ్రిటీ లింక్?.. కాంతార నటుడిపై సిట్ ఫోకస్!
‘‘విదేశీ ప్రముఖులతో సహా ద్రౌపది ముర్ము విందుకు హాజరరైన ప్రతీ ఒక్కరూ గౌరవ సూచకంగా దానిని ధరించారు. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే దానికి నిరాకరించారు’’ అని అమిత్ సా అన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఈశాన్య సంస్కృతిని, అస్సాం – ఈశాన్య ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి. లేకపోతే, అతను ఓట్లు అడగకూడదు’’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
రాష్ట్రపతి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం ద్వారా రాహుల్ గాంధీ ప్రతిష్టను నాశనం చేయాలని అనుకుంటున్నారని, కానీ వారు విజయం సాధించలేదని అన్నారు. ఆ కార్యక్రమంలో గమోసా ధరించని వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే కాదని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ధరించలేదని ఖర్గే అన్నారు.