Site icon NTV Telugu

Amit Shah: 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించండి.. అథ్లెట్లకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన అమిత్ షా

Amitshah

Amitshah

2036 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. ప్రపంచ పోలీస్‌–ఫైర్‌ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృంద సభ్యులను అమిత్ షా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా21వ ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడల్లో భారత బృందం 613 పతకాలు గెలుచుకోవడం పట్ల హోంమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పోలీసు మరియు అగ్నిమాపక సేవల బృందం అద్భుతమైన ప్రదర్శనకు.. దేశాన్ని గర్వపడేలా చేసినందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట

2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడంలో భారత్ టాప్-5లో ఉండాలని అమిత్ షా ఆకాంక్షించారు. అందుకోసమే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా 3,000 మంది అథ్లెట్లకు ప్రభుత్వం నెలకు రూ.50,000 సాయం అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా క్రీడలకు గొప్ప ప్రాముఖ్యత ఇచ్చినట్లు అమిత్ షా గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: ఊహాగానాలు వద్దు.. మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా దర్యాప్తు సంస్థ

ఇక 2036లో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు భారతదేశం బిడ్ వేయబోతుందని చెప్పారు. ఈ పోటీల్లో పతకాల జాబితాలో భారత్ మొదటి ఐదు స్థానాల్లో ఉండాలని విశ్వాసం వ్యక్తం చేశారు. గెలుపు, ఓటమి జీవితానికి శాశ్వత చక్రం అని, గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, విజయం కోసం ప్రణాళిక వేయడం ప్రతి ఒక్కరి స్వభావం కావాలన్నారు. గెలవడం అలవాటు కావాలని హోంమంత్రి అన్నారు. గెలిచే అలవాటును పెంపొందించుకునే వారు ఎల్లప్పుడూ అసాధారణంగా రాణిస్తారన్నారు. ప్రతి గ్రామానికి క్రీడలను తీసుకెళ్లడానికి మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ప్రతి క్రీడలో వివిధ వయసుల పిల్లల ఎంపిక మరియు శిక్షణ శాస్త్రీయంగా జరుగుతోందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక

గతంలో 2032 వేసవి ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేసింది. కానీ తర్వాత 2036 వేసవి ఒలింపిక్స్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు బిడ్ చేయడానికి సిద్ధపడుతోంది. 2021లో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AUDA)ని కన్సల్టెంట్‌గా నియమించింది, అహ్మదాబాద్, గాంధీనగర్‌లోని 22 ప్రదేశాలను ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ అనే పెద్ద క్రీడా సముదాయాన్ని అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్నారు , ఇందులో అనేక బహుళ-క్రీడా వేదికలు ఉంటాయి. ఒలింపిక్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

Exit mobile version