NTV Telugu Site icon

Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా. సమకాలిన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించారు. భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు అని పాశ్చాత్య మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల హిండెన్ బర్గ్ విడుదల చేసిన రిపోర్టులతో అదానీ షేర్లు పడిపోతున్నాయి. అయితే ఇది కావాలని కొన్ని భారత వ్యతిరేక శక్తులు ఇలా చేస్తున్నాయనే ఆరోపణలు చేస్తున్నాయి. భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు, బీజేపీ వ్యతిరేక శక్తులు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ తన ఆర్గనైజర్ పత్రికలో విమర్శించింది.

Read Also: Donor Organ Transplants : దాతల అవయవ మార్పిడిలో తెలంగాణ, మహారాష్ట్ర అగ్రస్థానం

వ్యాపారం రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలనే భారత ఆశయాలను దెబ్బతీస్తాయని గ్లోబల్ మీడియా ఊహిస్తోందని.. మేము భూకంపాలను, కరువులను, మాంద్యం, యుద్ధం, తీవ్రవాద దాడులను ఎదుర్కొని జీవించామని.. నేను చెప్పేది ఒక్కటే, భారత్ కు వ్యతిరేకంగా ఎప్పుడు పందెం కాయొద్దు అని ఆయన ట్వీట్ లో గ్లోబల్ మీడియాను హెచ్చరించారు. ప్రపంచంలోనే శరవేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది భారత్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలోకి చేరుకుంది. రానున్న కాలంలో మరింత పురోగమించాలని అనుకుంటున్న తరుణంలో అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.