America’s warning on China’s objections: భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ‘యుద్ అభ్యాస్’పేరుతో ఉత్తరాఖండ్ లో ఇరు దేశాల సైనికులు సైనిక విన్యాసాలు చేస్తున్నారు. చైనా సరిహద్దు ఎల్ఓసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. అయితే ఈ సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ 1993,96 ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో భారత్ కు అండగా నిలిచింది అమెరికా.
Read Also: Mobiles ban In Temples: దేవాలయాల్లో మొబైల్ ఫోన్ బ్యాన్.. హైకోర్టు ఆదేశాలు
చైనా అభ్యంతరాలకు వ్యతిరేకంగా భారత్ కు అండగా నిలుస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో చైనా జోక్యం తగదని అంది. భారతదేశంలో యూఎస్ దౌత్యవేత్త ఎలిజబెత్ జోన్స్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎవరితో సైనిక విన్యాసాలు చేయాలనేది సొంత విషయం అని ఇందులో మూడో దేశానికి అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. చైనాకు ఏమాత్రం సంబంధం లేని విషయమని అన్నారు.
చైనా అభ్యంతరాలపై భారత్ కూడా స్పందించింది. చైనాతో 1993, 1996లో చేసుకున్న ఒప్పందాలకు ఈ ఉమ్మడి విన్యాసాలకు ఎలాంటి సంబంధం లేదని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడాన్ని కూడా ప్రస్తావించారు. భారతదేశం, అమెరికాతో కలిసి 18వ సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించింది. దీంతో పాటు భారత్ తో వ్యాపార, వాణిజ్య సంబంధాలపై కూడా ఎలిజబెత్ జోన్స్ మాట్లాడారు. గత ఏడేళ్లలో వాణిజ్యం రెండింతలు పెరిగి 157 బిలియన్ డాలర్లకు చేరకుందని అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం అవసరం ఉంటుందని ఎవరూ అనుకోరని అన్నారు.