దీపావళి పండుగను పురస్కరించుకుని నీతా అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ నుంచి బహుమతులు పంపించారు. సహచర వ్యాపారస్తులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌లు పంపించారు. పండుగ సీజన్‌లో వ్యాపార సహచరులు, పరిచయస్తులకు రిలయన్స్ ఫౌండేషన్ గిఫ్ట్‌లు పంపించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా బహుమతులు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Fruit Juices: ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్‌లు తాగుతున్నారా..? స్ట్రోక్ వచ్చే ప్రమాదం
దీపావళి హాంపర్‌లో బాదం, వెండి గణేష్ విగ్రహం, దియా, మరిన్నింటిని బహుమతులుగా అందజేశారు. టేబుల్ లినెన్‌తో సహా శిల్పకళా బహుమతులు కూడా ఉన్నాయి. స్థానిక కళాకారులు చేతితో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. చిన్న వెండి గణేష్ విగ్రహం. బాదం ప్యాకెట్, ధూప్ స్టిక్స్, స్టాండ్ ప్యాకెట్ మరియు స్వదేశ్ నుండి టేబుల్ లినెన్ సెట్ ఉన్నాయి.
రిలయన్స్ ఫౌండేషన్ అనేది దాతృత్వ విభాగం. ఇది 2010లో ముఖేష్ అంబానీ స్థాపించారు. ఇది నీతా అంబానీ నేతృత్వంలో నడుస్తుంది. గ్రామీణ పరివర్తన, విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తు ప్రతిస్పందన, క్రీడలు మరియు మహిళా సాధికారత వంటి అనేక రకాల కార్యక్రమాలపై ఫౌండేషన్ దృష్టి సారిస్తుంది.