NTV Telugu Site icon

Amarnath Yatra: కశ్మీర్ లోయలో భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్

Amarnath Yatra

Amarnath Yatra

వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కశ్మీర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు. ఉదయం పహల్గామ్, బల్తాల్ మార్గాల నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పవిత్ర గుహ మందిరం వైపు యాత్రికులను అనుమతించడంలేదని వారు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..

యాత్ర కొంతకాలం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నామని… పహల్గామ్‌, బల్తాల్‌ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని… వర్షం తగ్గాక పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఐటీబీపీ వర్గాలు వెల్లడించాయి. అధిక వర్షాల కారణంగా జులై 5, జులై 8న ఇప్పటికే రెండు సార్లు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. జూలై 8న 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతైన సంగతి కూడా తెలిసిందే. అప్పుడు యాత్రను మూడు రోజుల పాటు నిలిపివేశారు. సోమవారం(జులై 11న) తిరిగి పహల్గామ్, బల్తాల్ మార్గాల నుండి యాత్ర ప్రారంభమైంది. తాజాగా మళ్లీ వర్షాల నేపథ్యంలో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.