Site icon NTV Telugu

వచ్చే ఎన్నికల్లో పాటియాలా నుంచి అమరీందర్‌ పోటీ

గత కొన్ని రోజులుగా పంజాబ్‌ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని సింగ్ చెప్పారు. సిద్ధూకు భయపడి మేము పాటియాలా ను వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరి వల్ల కూడా పాటియాలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమన్నారు.

పాటియాలా సింగ్ కుటుంబానికి బలమైన కోటగా ఉంది (అతని తండ్రి పాటియాలా రాష్ట్రానికి చివరి మహారాజు). అతను నాలుగు సార్లు ఈ సీటును గెలుచుకున్నాడు. అతని భార్య ప్రణీత్ కౌర్ 2014 నుండి 2017 వరకు మూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతి నిధ్యం వహించారు. ఇటీవల, సింగ్ తన కొత్త రాజకీయ పార్టీ – ‘పంజా బ్ లోక్ కాంగ్రెస్’ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీకి లేఖ పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసిన వెంటనే అమరీందర్‌ నుంచి ఈ ప్రకటన వచ్చింది. అనంతరం అమ రీందర్‌ సింగ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్ని కల కోసం సరి కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తానని చెప్పారు. సీట్ల పంపకాల ప్రణాళిక కూడా 110శాతం రూపొందుతుందన్నారు. రైతు లు కూడా పోరాటానికి సహకరించాలని అమరీందర్‌ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version