అప్పుడప్పుడు కోర్టు ముందుకు వింత వింత కేసులు వస్తుంటాయి. అలాంటి కేసులను కోర్టులు చాకచక్యంగా పరిష్కరిస్తుంటాయి. ఇటీవలే ఓ వింతకేసులో యూపీలోని అలహాబాద్ కోర్టు తీర్పును ఇచ్చింది. మైనర్ బాలుడిని తమ సంరక్షణలో ఉండేలా అనుమతించాలని కోరుతూ బాలుడి తల్లి, బాలుడి భార్య ఇద్దరూ కోర్టుకు వెళ్లారు. గతేడాది సెప్టెంబర్ 21 న కోర్టులో కేసు దాఖలైంది. బాలుడి వాగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. తనకు పెళ్లామే కావాలని ఆ బాలుడు మొండిపట్టు పట్టాడు. మైనర్ బాలుడికి సంరక్షణ బాధ్యత భార్యకు అప్పగిస్తే ఫోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది కాబట్టి బాలుడిని మైనర్ తీరేవరకు అంటే 2022, ఫిబ్రవరి 4 వరకు స్టేట్ హోమ్‌కు తరలించాలని,మైనర్ తీరిన తరువాత మరోసారి బాలుడి వాగ్మూలం రికార్డ్ చేసి అతడి ఇష్టప్రకారం ఎవరివద్దనైనా ఉండొచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది.