వివాహ బంధానికి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సమాజం అంగీకరించదు. ఈ మధ్య వివాహేతర సంబంధాలు కారణంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలిసిందే. పడక సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే కడతేరుస్తున్న రోజులవి. ఇలాంటి తరుణంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘‘లివింగ్ రిలేషన్ షిప్’’ ఏ మాత్రం తప్పు కాదని.. మహిళల ప్రశాంత జీవనానికి భంగం కలిగించొద్దని సూచించింది. జంటలకు రక్షణ కల్పించాల్సిందేనని పోలీసులకు ఆదేశిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
సహజీవనం చేస్తున్న 12 జంటలు తమకు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లివింగ్ రిలేషన్ షిప్ సంబంధాలను చట్టవిరుద్ధం అని చెప్పలేమని పేర్కొంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేనంతమాత్రాన కలిసి జీవించడం ఏ మాత్రం నేరం కాదని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న 12 మంది మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను కోర్టు ఆదేశించింది. మహిళల ప్రశాంత జీవనానికి ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సిందని సూచించింది. ఈ తీర్పు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Obama: ఈ ఏడాది ఒబామాను మెప్పించిన సినిమాలు ఇవే!
‘‘మైనర్ లేదా మేజర్. వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా జీవించే హక్కు ఉందని.. దీన్ని చాలా ఉన్నత స్థాయిలో పరిగణించాలి. పిటిషనర్లు వివాహం చేసుకోలేదనే విషయం వాస్తవం. భారత రాజ్యాంగంలో భారత పౌరులుగా జీవించే ప్రాథమిక హక్కు వారికి ఉంది.’’ అని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. విద్యావంతులైన మహిళలు సొంత ఇష్ట ప్రకారం జీవించాలని అనుకున్నవాళ్లకు పోలీసులు రక్షణ కల్పించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
