Site icon NTV Telugu

Prajwal Revanna Arrest: “మహిళా పోలీస్” టీమ్‌తో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. సిట్ సానుకూల సందేశం..

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna Arrest: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జేడీఎస్ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణంలో కీలక పరిణామం ఎదురైంది. ఈ కేసు బయటకు రాగానే ఇండియా నుంచి జర్మనీ వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ, ఈ రోజు తెల్లవారుజామున బెంగళూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత బెంగళూర్ వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రజ్వల్ ముందస్తు బెయిల్‌ని బెంగళూర్ కోర్టు తిరస్కరించగా, తాజాగా కర్ణాటక హైకోర్టు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.

Read Also: Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

ప్రజ్వల్‌ని మహిళా పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన టీంలో అంతా మహిళా అధికారులే ఉన్నారు. అరెస్ట్ వివరాలను రాజకీయ నాయకుడిగా మారిన మాజీ పోలీస్ అధికారి భాస్కర్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘ పరారీలో ఉన్న ఎంపీని బెంగుళూరు విమానాశ్రయం నుంచి మహిళా పోలీస్ టీం అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. ఈ చర్య వందలాది మందికి బలమైన సంకేతాన్ని పంపుతుందని, సిట్ నిర్ణయం బలమైన సానుకూల సందేశం.’’ అని పోస్ట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) కార్యాలయానికి తీసుకెళ్లారు, అక్కడ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించనుంది.

ఏప్రిల్ 27 తర్వాత ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్పబడుతున్న అనేక సెక్స్ వీడియోలు హసన్ జిల్లాతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో వైరల్ అయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయారు. ఈ ఘటనను విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

Exit mobile version