NTV Telugu Site icon

Hardeep Nijjar murder: ఖలిస్తానీ నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు బెయిల్..

Nihjjar

Nihjjar

Hardeep Nijjar murder: 2023లో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య కెనడా, ఇండియా సంబంధాలు ప్రభావితం చేసింది. ప్రధాని జస్టిన్ ట్రూడో స్వయంగా అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, భారత్ కెనడా ప్రధాని వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇది అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా టెర్రరిస్టులకు, గ్యాంగ్‌స్టర్లకు కేంద్రంగా మారిందని ఆరోపించింది.

Read Also: Hyderabad: జీహెచ్ఎంసీ ఆఫీసులో కాంట్రాక్టర్ల నిరసన.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..!

ఇదిలా ఉంటే, తాజాగా నిజ్జర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయులకు కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నలుగురు నిందితులైన భారతీయ పౌరులు – కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్‌లపై ఫస్ట్-డిగ్రీ హత్య, హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలు మోపబడ్డాయి. ఈ హత్య కేసు విచారణను బ్రిటీష్ కొలంబియా కోర్టు సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 11కి షెడ్యూల్ చేయబడింది. మే 2024లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (RCMP) ఈ నలుగురు భారతీయులను అరెస్టు చేశారు.

Show comments