Site icon NTV Telugu

Aligarh Mosque: హోలీ సందర్భంగా అలీగఢ్ మసీదుకు ముసుగు..

Aligarh Mosque

Aligarh Mosque

Aligarh Mosque: దేశవ్యాప్తంగా హోలీ పండగ సంబరాలు మొదలయ్యాయి. అయితే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కొన్ని చోట్ల మసీదులను టార్పిలిన్లలో కప్పారు. ముఖ్యంగా చాలా సున్నిత ప్రాంతం అయిన అలీగఢ్ లోని మసీదును టార్పలిన్లతో కప్పారు. హోలీ సమయంలో రంగులు పడకుండా మసీదును కప్పినట్లు నిర్వాహకులు తెలిపారు.

Read Also: Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?

అలీగఢ్ లోని అబ్దుల్ కరీం మీసీదు హల్వాయియన్ ప్రాంతంలో ఉంది. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఈ ప్రాంతం ఉంది. పోలీసుల సూచనల మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. గత కొన్నేళ్లుగా హోలీ రోజున మసీదును కప్పి ఉంచుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 6-7 ఏళ్లుగా హోలీ రోజున ఇలాగే మసీదును కప్పిఉంచుతున్నారని స్థానిక నివాసి అఖీల్ పహల్వాన్ అన్నారు.

Exit mobile version