Site icon NTV Telugu

Alcohol: హైదరాబాద్ సంస్థ నయా ఆఫర్.. 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ

Liquor Home Delivery

Liquor Home Delivery

హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. కేవలం 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్‌లో కాదు.. కోల్‌కతాలో. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ బూజీ అనే బ్రాండ్‌తో కోల్‌కతాలో లిక్కర్‌ డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని ఇన్నోవెంట్​ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్​పేర్కొంది.

Central Government: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేత

మద్యం డోర్ డెలివరీ విషయంపైఎక్సైజ్​శాఖ అనుమతి పొందిన తర్వాత కోల్‌కతాలోని తూర్పు ప్రాంతంలో ఈ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవెంట్​ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. మద్యం డెలివరీ చేసేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని సంస్థ సీఈవో వివేకానంద తెలిపారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్​ ఇచ్చేందుకు వినియోగదారులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫొటోను అప్‌లోడ్​చేసి వయస్సు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సగటున ఒక వినియోగదారుడికి ఎంత మద్యం విక్రయించాలనే విషయంపై బెంగాల్ సర్కారు పరిమితులు విధించింది. ఆ పరిమితి దాటితే మద్యం ఆర్డర్ ఇవ్వలేరు.

Exit mobile version